ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో డీజీఎం లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇంచార్జ్ సురేష్ మాట్లాడుతూ ఈ సంక్రాంతి అందరిలో వెలుగు నింపాలని కోరుకున్నారు. . ముగ్గులలో రంగుల వలె విద్యార్థుల జీవితము కూడా రంగుల మాయం కావాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పుల్లయ్య మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులకు సంస్కృతి సంప్రదాయక విలువలు తెలియజేయడం ఎంతో అవసరం అన్నారు. సంక్రాంతి ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.