ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలోని జిల్లా ప్రజాపరిషత్ సెకండరీ పాఠశాల లో 1999-2000 బ్యాచ్ కు చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థలు ఆదివారం పాఠశాల ప్రాంగణంలో ఆత్మీయ సమ్మేళనం సిల్వర్ జూబ్లీ ఘనంగా నిర్వహించుకున్నారు. పూర్వవిద్యార్థులు బాల్య స్మృతులను నెమరువేసుకున్నారు, 25 సంవత్సరాల తర్వాత ఒకే చోట కలుసుకోవడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో గురువులు ప్రిన్సిపల్ శ్రీరామ్ రెడ్డి , రమేష్ , శోభ రాణి, రవీందర్ అధ్యక్షతన పూర్వ విద్యార్థులు గుర్రం వేణు ,గోపు మల్లికార్జున్, నర్సిరెడ్డి ,తోట రామకృష్ణ, గోని అశోక్ కమిటీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు..
