Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైవిరెడ్డి విజ్ఞాన కేంద్రం ప్రారంభం

మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైవిరెడ్డి విజ్ఞానకేంద్రాన్ని (గ్రంథాలయం) ముఖ్య అతిథి సూర్యా పేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు పాల్గొని శనివారం ప్రారంభించారు. అనంతరం వై వి రెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి పందిరి ఫౌండేషన్ సలహాదారు యస్ యస్ రావు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా వంగవీటి రామారావు మాట్లాడుతూ.. పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయం ఏర్పాటు అభినందనీయం అని పందిరి ఫౌండేషన్ చైర్మన్ నాగిరెడ్డి ని కొనియాడారు.గ్రంథాలయం ను విద్యార్థులు ఉపయోగించుకొని,ప్రవేశ పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలని,అదేవిధంగా ఉద్యోగాలు సాధించుకోవచ్చని అన్నారు.ప్రభుత్వం నుంచి తన వంతుగా సహకారం అందిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో టి పి సి సి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మి నారాయణ రెడ్డి,మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి,కోదాడ మువిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వర రావు,పందిరి ఫౌండేషన్ చైర్మన్ పందిరి నాగిరెడ్డి,సెక్రటరీ ఇమ్మడి సతీష్ బాబు,ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి చిన్ని,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోటేశ్వర రావు,సీనియర్ జర్నలిస్టు హరి కిషన్,గ్రామ పెద్దలు సత్య నారాయణ రెడ్డి,ఇంద్రశేఖర్ రెడ్డి, ఆర్.ప్రభాకర్ రెడ్డి,రామకృష్ణ, నాగేశ్వర రావు,శ్రీ పాల్ రెడ్డి,అప్పిరెడ్డి పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామంలో ఇటీవల ప్రభుత్వ ఉద్యోగం సాధించిన 10 మంది అభ్యర్థులను పందిరి ఫౌండేషన్ తరపున ముఖ్య అతిథులతో కలిసి శాలువాతో సన్మానించి బొకే మరియు మెమెంటో అందజేశారు.

 

Related posts

నేల తల్లిని విస్మరిస్తే ప్రమాదాలు తప్పవు

TNR NEWS

జూనియర్ లెక్చరర్ సాధించిన యువకునికి సన్మానం

TNR NEWS

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల

TNR NEWS

ప్రభుత్వ విజయాలు వివరించేందుకు కళాయాత్ర :   తెలంగాణ సాంస్కృతిక సారధి నర్సంపేట టీం లీడర్ నెల్లుట్ల సుమన్.

TNR NEWS

TNR NEWS

మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ని కలిసిన మైనార్టీ నాయకులు

TNR NEWS