మోతే: మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రాఘవాపురం గ్రామంలో కీర్తిశేషులు ఒగ్గు లింగయ్య, వెంకటమ్మ జ్ఞాపకార్థం సంక్రాంతి పండుగ సందర్భంగా భగత్ సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు మరియు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సంస్కృతి ,సాంప్రదాయాలకు ముగ్గులు చిహ్నం అన్నారు. అన్ని పండగలు కన్నా సంక్రాంతి పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ముగ్గుల పోటీలు దోహదపడతాయని అన్నారు. భగత్ సింగ్ యువజన సంఘం అధ్యక్షులు బూడిద లింగయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో గ్రామ వాస్తవ్యులు ఎస్సై వినయ్ కుమార్, ఎక్సైజ్ ఎస్సై మట్టిపల్లి గురవయ్య, భగత్ సింగ్ యువజన సంఘం ఉపాధ్యక్షులు కిన్నర పోతయ్య ప్రధాన కార్యదర్శి కొమ్ము క్రాంతికుమార్ సభ్యులు బూ దురు శ్రీనివాస్, బూడిద సైదులు, ఉపాధ్యాయులు కోరిపల్లి సైదులు, డీలర్ కోరిపల్లి విక్రమ్, విజయ్, సతీష్, మట్టిపల్లి దేవలింగం, పాలకూరి లింగస్వామి, లక్ష్మి, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.