Tnrnews.in
తెలంగాణ

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ముస్తాబాద్ మండలం గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1989 – 1990 పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు గూడెంలో మహేశ్వరి గార్డెన్ లో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒకచోట చేరి గత అనుభవాలు నెమరు వేసుకున్నారు. 35 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారంతా ఒకరికొకరు పలకరించుకొని వారి జీవన స్థితిగతులు పంచుకుని రోజంతా ఆనందంగా గడిపారు. ఇన్ని సంవత్సరాల తర్వాత నాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. అనంతరం ఆనాటి ఉపాధ్యాయులను పూర్వవిద్యార్థులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బైరినేని వెంకటేశ్వరరావు బండ నాంపల్లి కొమిరిశెట్టి తిరుపతి. ఉమాపతి రావు. ప్రవీణ్. దేవేందర్. లక్ష్మణ్. మార్వాడి గంగారం. కె పద్మ. ఎస్ పద్మ. తిరుపతి పూర్వ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రైతుల భూములలో మట్టి నమూనాల సేకరణ

TNR NEWS

ముస్లిం జేఏసీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విమాన మృతులకు నివాళులు

TNR NEWS

రైతులపై చవితి తల్లి ప్రేమ చూపెడుతున్న కేంద్ర ప్రభుత్వం

Harish Hs

కొడంగల్ నియోజకవర్గంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర పై దాడి చేయడం అమానుషం కలెక్టర్ పై దాడి ప్రజాస్వామ్యంపై దడే ప్రతీక్ జైన్ కు కేసిఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

TNR NEWS

ముగిసిన ప్రకాశ్‌రాజ్ ఈడీ విచారణ

TNR NEWS

తెలంగాణలో రానున్న 2 గంటల్లో భారీ వర్షాలు: వాతావరణ శాఖ….

TNR NEWS