July 6, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి  వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

మోతే: మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రాఘవాపురం గ్రామంలో కీర్తిశేషులు ఒగ్గు లింగయ్య, వెంకటమ్మ జ్ఞాపకార్థం సంక్రాంతి పండుగ సందర్భంగా భగత్ సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు మరియు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సంస్కృతి ,సాంప్రదాయాలకు ముగ్గులు చిహ్నం అన్నారు. అన్ని పండగలు కన్నా సంక్రాంతి పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ముగ్గుల పోటీలు దోహదపడతాయని అన్నారు. భగత్ సింగ్ యువజన సంఘం అధ్యక్షులు బూడిద లింగయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో గ్రామ వాస్తవ్యులు ఎస్సై వినయ్ కుమార్, ఎక్సైజ్ ఎస్సై మట్టిపల్లి గురవయ్య, భగత్ సింగ్ యువజన సంఘం ఉపాధ్యక్షులు కిన్నర పోతయ్య ప్రధాన కార్యదర్శి కొమ్ము క్రాంతికుమార్ సభ్యులు బూ దురు శ్రీనివాస్, బూడిద సైదులు, ఉపాధ్యాయులు కోరిపల్లి సైదులు, డీలర్ కోరిపల్లి విక్రమ్, విజయ్, సతీష్, మట్టిపల్లి దేవలింగం, పాలకూరి లింగస్వామి, లక్ష్మి, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తుల సమస్యలను సత్వరం పరిష్కరించాలి – పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్

TNR NEWS

గడువు లోపు ఓటర్ గా నమోదు చేసుకోండి… మద్నూర్ తహసిల్దార్ ఏం డి ముజీబ్

TNR NEWS

రాష్ట్రస్థాయి చెస్ అండర్ 13 కి ఎంపికైన తాడువాయి గ్రామానికి జిల్లేపల్లి శ్యాముల్

TNR NEWS

మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన సదస్సు.  డిఎంహెచ్వో వెంకట రవణ  డాక్టర్ నిరోషా ఎన్సిడి ప్రోగ్రాం అధికారి ఆదేశాల మేరకు.

TNR NEWS

కామదేను 2024 అవార్డు  

TNR NEWS

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి

Harish Hs