తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా పథకంలో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం గురువారం మునగాల మండల పరిధిలోని మాధవరం,రేపాల,కలకోవా, గణపవరం రెవెన్యూ గ్రామాలలో వ్యవసాయ విస్తరణ అధికారులు,రెవెన్యూ అధికారులు మరియు పంచాయతీ కార్యదర్శులు నాలుగు టీములుగా ఏర్పడి వ్యవసాయానికి యోగ్యం కానీ భూములను గుర్తించే ప్రక్రియలో ఫీల్డ్ సర్వే విచారణలు జరుపుతున్నారు.
ఈ రైతు భరోసా సర్వే ప్రక్రియను సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు మాధవరం గ్రామంలో నిర్వహిస్తున్న సర్వేను పరిశీలించి,ఎలాంటి తప్పులు జరగకుండా సర్వేను ఈ నెల 20 వ తారీకు లోగా 11 రెవెన్యూ గ్రామాలలో పూర్తి చేయాలి అని 21 నుండి 24 వరకు వ్యవసాయ యోగ్యం కాని భూముల జాబితాను ను అన్ని గ్రామాల గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రచురించి,తుది జాబితా తయారు చేయాలని ఆదేశించడం జరిగింది.
ఈ సర్వే పరిశీలన కార్యక్రమం లో కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ,మండల స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ సీఈవో శిరీష,తహసీల్దార్ ఆంజనేయులు,ఎంపీడీవో రమేష్,ఎంఈఓ రాజు,ఏఈఓ భవాని,నాగు,రమ్య,రేష్మ, రెవెన్యూ సిబ్బంది,రైతులు పాల్గొన్నారు.