సూర్యాపేట టౌన్ :సూర్యాపేట కు చెందిన సిపిఎం సీనియర్ నాయకులు మరిపెల్లి వెంకన్న అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడం తో శనివారం సూర్యాపేట 48 వార్డ్ వాణిజ్య భవన్ శాఖ కార్యదర్శి బొమ్మిడి లక్ష్మినారాయణ వెంకన్న నివాసం కు వెళ్లి పరామర్శించి ఆరోగ్య సమాచారం తెలుసుకొని ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బొమ్మిడి లక్ష్మినారాయణ మాట్లాడుతూ గత 30 ఏండ్లుగా సిపిఎం కార్యకర్తగా ప్రజల సమస్యలపై మాతో పాటు పోరాటాలు నిర్వహించారు అని తెలిపారు.అనారోగ్యం గా ఉన్నారని తెలుసుకొని పరామర్శించినట్టు తెలిపారు. వీరి వెంట సిపిఎం మహిళా నాయకురాలు చిత్రం భద్రమ్మ, నాయకులు జి సురేష్. డి కిషన్ జి, దుబ్బాక నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.