కోదాడ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా నియామకమైన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ బషీర్ ను కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి, 20వ వార్డు ఇన్చార్జి కాంపాటి శ్రీను ఆధ్వర్యంలో పలువురు గురువారం బంజర కాలనీలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బషీర్ మాట్లాడుతూ తనకు వచ్చిన ఈ పదవితో అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా పేదలకు తన శక్తి వంచన లేకుండా సేవ చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా బషీర్ ను పలువురు అభినందిస్తూ శాలువాలు, పూల బొకేలు అందజేసి స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి 20వ వార్డు ఇన్చార్జి కాంపాటి శ్రీను, కుడుముల లక్ష్మీనారాయణ, కాంపాటి పుల్లయ్య, ముస్తఫా, డేగల విజయ్,రమేష్, నారాయణ, శివ తదితరులు పాల్గొన్నారు……….