చేర్యాల పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాన్ని అవినీతి రహితంగా చేపట్టాలని నిర్వహకులను కోరారు.పంట నమోదు సమయంలో రైతులు కంది పంటను నమోదు చేసుకోలేక పోయిన అంతర పంటగా నమోదు చేసుకునే అవకాశాన్ని ఇప్పుడైనా కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను కొరినారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదు ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి నట్టేట ముంచిందని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరాకు రూ.7500 ఇస్తానని ఇప్పటి వరకు ఇవ్వలేదు గత కేసీఆర్ ప్రభుత్వం దారిదాపుగా కోటి 52లక్షల ఎకరాలకు 12సార్లు ఇచ్చింది.వ్యవసాయానికి కేసీఆర్ చేసినంత సేవ దేశ చరిత్రలో ఎవరూ చేయలేదని అన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడ్తున్నారని అగ్రహం వ్యక్తం చేసారు.రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో చేయలేదు. రెండుసార్లు రైతులకు అందాల్సిన రైతు భరోసా ఇప్పటి వరకూ దిక్కులేదు. కేసీఆర్ హయాంలో చినుకులు పడే సమయంలో రైతుబంధు డబ్బులు జమ చేసేవారు.కాంగ్రెస్ వచ్చాక రైతును ఆగ మాగం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఏది అయితే ప్రమాణం చేసావో 2లక్షల రుణమాఫీ ప్రతి రైతు ఖాతాలో వేయాలి.ప్రతి రైతుకు కచ్చితంగా రూ.7500 తప్పకుండా ఇవ్వాలి.ఎకరానికి రూ.17500 ఈ ప్రభుత్వం బాకీ పడ్డది.రుణమాఫీ 30శాతం కూడా రాలేదని రైతులు అంటున్నారు.22లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని అలాగే భూమి లేని నిరుపేదలకు కోటి మంది ఉపాధి హామీ కూలీలకు రూ.12వేలు ఇస్తానని చెప్పిన హామీని వెంటనే అమలు చేయాలి ఆని లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ చేర్యాల మండల మరియు పట్టణ అధ్యక్షులు ఆనంతుల మల్లేశం,ముస్తాల నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణి,వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి,కౌన్సిలర్ మంగోలు చంటి,ఎఎంసి మాజీ చైర్మన్ పుర్మ వెంకట్ రెడ్డి,మాజీ ఎంపీపీ కరుణాకర్,అవుషేర్ల కిషోర్,శివగారి అంజయ్య,ఆరిగే కనకయ్య తదితరులు ఉన్నారు.