కోదాడ పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. సీనియర్ నాయకులు పైడిమరి సత్తిబాబు,పట్టణ అధ్యక్షులు షేక్ నయీమ్ లు స్థానిక నాయకులతో కలిసి కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో కెల్లా భారతదేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని తీర్చిదిద్ది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. నేడు దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన సాగిస్తు ప్రజల పాలిట శాపంగా మారాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించారు. రాజ్యాంగం ద్వారానే పౌరులందరికీ సమాన హక్కులు లభించాయన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు షేక్ నయీమ్, సీనియర్ నాయకుడు పైడిమర్రి సత్యబాబు, సంగిశెట్టి గోపాల్, కర్ల సుందర్ బాబు, ఎం.డీ.ఇమ్రాన్ ఖాన్, కాసాని మల్లయ్య గౌడ్ , చీమ శ్రీనివాసరావు, చలిగంటి వెంకట్, నరమనేని శ్రీను, షేక్ ఆరీఫ్, కర్ల నరసయ్య(కమాన్) గొర్రె రాజేష్, షేక్ జానీ, కె.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు…….
previous post