సిర్పూర్ నియోజకవర్గం.
కాగజ్ నగర్ డివిజన్ సిర్పూర్(టి) రేంజ్ పరిధి చింతకుంట్ల సెక్షన్ లో బర్డ్ వాక్ ఫెస్టివల్ ను అటవీ శాఖ అధికారులు ఘనంగా నిర్వహించారు.వివిధ ప్రాంతాల నుంచి వచ్చి న పక్షి ప్రేమిక పర్యాటకులు పాల్గొని వివిధ రకాల దేశీ, విదేశీ పక్షులను తమ కెమె రాల్లో బంధించారు.సిర్పూర్ రేంజ్ పరిధిలో చింతకుంట సెక్షన్ లోని వివిధ కుంటలు హీరాపూర్ వాగు,జీడివాగు తదితర ప్రాంతాల్లో పక్షి ప్రే మికులు పర్యటించారు.ఈ కార్యక్రమంలో ఎఫ్డివో సు శాంత్ బోబడే,ఎఫ్ఆర్ఓ ఇక్బాల్ హుస్సేన్,సెక్షన్ ఆఫీసర్లు మోహన్ రావు, ప్రసాద్ రావు,బీట్ ఆఫీసర్ మల్లి కార్జున్ తదితరులు పాల్గొన్నారు.