మాస్టిన్ కుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నామని వెనుకబడిన మా కులాన్ని ప్రభుత్వం గుర్తించి అన్ని హక్కులను కల్పించాలని మాస్తిన్ కుల రాష్ట్ర అధ్యక్షులు నాగిళ్ల నరసయ్య డిమాండ్ చేశారు. ఇటికల మధు అధ్యక్షతన మంగళవారం కోదాడ పట్టణంలోని సాలార్జంగ్ పేటలో కోదాడ మండల మాస్టన్ కుల నూతన కమిటీ ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. వెనుకబడిన మా కులం హక్కులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని, కనీసం కుల ధ్రువీకరణ పత్రం కూడా మండల కేంద్రంలోని తాసిల్దార్ ద్వారా కాకుండా ఆర్డిఓ ద్వారా ఇవ్వడం సమంజసం కాదని అన్నారు. గత కొంతకాలంగా హక్కుల కోసం పోరాడుతున్నామని అదే ధోరణిని ప్రదర్శించేందుకు పూర్తిస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కమిటీల ఏర్పాటు ముగిసిన అనంతరం ఈనెల 25వ తారీఖున కరీంనగర్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని ఈ బహిరంగ సభ ద్వారా మా సత్తా ఏంటో చాట్ చెప్తామన్నారు. మండల కమిటీలో స్థానం లేనివారు రాష్ట్ర కమిటీ లో తప్పనిసరిగా స్థానం కల్పిస్తామని, ప్రతి కుల బంధువులు బహిరంగ సభకు హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. అనంతరం నూతనంగా ఏర్పాటైన మండల కమిటీ అధ్యక్షులు నాగేల్ల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు దర్శనం వెంకటేశ్వర్లు, కోశాధికారి నాగిళ్ల దానేలు, ప్రధాన కార్యదర్శి ఇటికాల అబ్రారాము, కార్యదర్శి సులోమన్ ను అభినందించారు ఈ కార్యక్రమంలో ఇటుకల నాగరాజు, నాగిల్లి గోపి, నాగిల్లి చిరంజీవి, ఇటుకల రవి, రాముడు, ఎంకన్న, చిన్నోడు, తదితరులు పాల్గొన్నారు