Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

ఎన్నికల్లో ఆర్టిజన్లకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలి.. ఒకే శాఖలో రెండు సర్వీసు రూల్స్ హాస్యాస్పదం.. -బిజెపి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి..

ఒకే శాఖ ఉద్యోగులకు వేరువేరుగా సర్వీసు రూల్సు పెట్టి, ఆర్టిజన్లకు అన్యాయం చేయడం పట్ల పెద్దపల్లి బిజెపి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ ఎస్ఈ కార్యాలయం వద్ద సోమవారం ఆర్టిజన్లు చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపిన ఆయన మాట్లాడుతూ, విద్యుత్తు ఉత్పత్తి, సరఫర, పంపిణీ తదితర కీలకమైన విభాగాల్లో విద్యుత్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న ఆర్టిజన్లను ప్రభుత్వం ధగా చేస్తోందని మండిపడ్డారు. రెండు సర్వీస్ రూల్స్ పెట్టి విద్యుత్ ఉద్యోగులకు ఒక తీరుగా, ఆర్టిజన్లకు మరొక తీరుగా వేతనాలు చెల్లించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. పర్మనెంటు ఉద్యోగులకు సౌకర్యాలు, హక్కులు, ప్రమోషన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తున్నారనన్న ఆయన ఆర్టిజన్స్ విషయంలో ఆ రూల్సు ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. ఆర్టిజన్లను విద్యుత్ ఉద్యోగుల రూల్సులో చేర్చి కన్వర్షన్ చేయాలని గుజ్జుల డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఆర్టిజన్స్ అందరినీ కన్వర్షన్ చేసి వారి విద్య అర్హతకు అనుగుణంగా ఉద్యోగాలు కల్పిస్తామని చేసిన వాగ్ధానాన్ని నిలుపుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఆర్టిజన్స్ సమస్యలను పరిష్కరించకుండా దాటేసే ధోరణి ప్రదర్శించడం సరైనది కాదని, ఇప్పటికైనా ఆర్టిజన్స్ జేఏసీ నాయకత్వంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని గుజ్జుల డిమాండ్ చేశారు. ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమానికి అండగా ఉంటామని గుజ్జుల స్పష్టం చేశారు.ఈ దీక్షలో టివిఏసి జాక్ చైర్మన్ మల్లూరి కిషన్ రెడ్డి, కన్వీనర్ మట్ట రాజు, కో చైర్మన్లు దుర్గం విశ్వనాథ్, శ్రీనివాస్ రెడ్డి,ఎల్లయ్య, కో కన్వీనర్లు రఘు, సందీప్, కొశాధికారి దేవేందర్, రవి, సతీష్ రెడ్డి, శ్రీనివాస్, కృష్ణ, శరత్, రాజబాబు, సుమన్, నరసన్న,రాజేందర్, శేఖర్, యూసుఫ్,శ్రీకాంత్, నరేష్, కుమార్,ఇబ్రహీం,తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా…… మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి….  ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్……

TNR NEWS

కోదాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

Harish Hs

కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్

Harish Hs

అధికారంలో ఉన్నాం బాధ్యతతో వ్యవహరించాలి – జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె. నాగబాబు

Dr Suneelkumar Yandra

జిల్లా అదనపు కలెక్టర్ చే సమాచార హక్కు రక్షణ చట్టం 2005 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

Harish Hs

కోదాడలో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

Harish Hs