పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన డి రమ్య అనారోగ్యానికి గురై నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందినారు కుటుంబ పరిస్థితి బాగాలేక వైద్య ఖర్చుల నిమిత్తం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సంప్రదించగా వెంటనే ఎమ్మెల్యే 2.50 లక్షలు మంజూరు చేసినారు. మంజూరైన ఎల్ఓసి చెక్కును బుధవారం ఎమ్మెల్యే నివాసమైన శివ పల్లి లో బాధిత కుటుంబ సభ్యులకు అందజేసినారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపినారు.