వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్ పల్లి పట్టణంలోని జ్ఞానోదయ డిగ్రీ కళాశాలలో బుధవారం ధన్వంతరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ని కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్య వృత్తికి వన్నెతెచ్చిన మహనీయుడు ధన్వంతరి అని కొనియాడారు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఉన్న విద్యార్థులు వైద్య వృత్తిని ఎంచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్, ప్రిన్సిపాల్ సంతోష్, వైస్ ప్రిన్సిపాల్ రాజు, అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
previous post