Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రజాసేవకు విరమణ ఉండదు

పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలు అందించాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో కోదాడ మున్సిపల్ పాలకవర్గం ముగుస్తున్న సందర్భంగా చైర్మన్ సామినేని ప్రమీల ఆధ్వర్యంలో వారిని శాలువా పూల బొకేలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోదాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పాలకవర్గం అన్ని విధాలుగా కృషి చేసిందని గత ఐదు సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఎంతో కష్టపడి పనిచేశారని ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. కరోనా మహమ్మారి, ఇటీవల వచ్చిన వరదల్లో మున్సిపల్ అధికారులు, పాలకవర్గం, పారిశుద్ధ్య కార్మికులు తమ శక్తి వంచన లేకుండా అన్ని విధాలుగా పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి పట్టణ ప్రజల మన్ననాలను పొందారన్నారు. ప్రజాసేవకు విరమణ ఉండదు అని పదవి ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏవైనా సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే తప్పక పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, కమిషనర్ రమాదేవి పాలకవర్గ సభ్యులు మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు………..

Related posts

కేసీఆర్‌ రైతుబంధు.. రేవంత్‌ రాబందు! కాంగ్రెస్‌ అంటే మోసం, దగా, నయవంచన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి..

TNR NEWS

ట్రాఫిక్ నియమాలు పాటించాలి:కోదాడ పట్టణ సీఐ శివ శంకర్

TNR NEWS

ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

TNR NEWS

వేమూరి సత్యనారాయణ సేవలు అభినందనీయం. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి.

Harish Hs

అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే……..  బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పూలే వర్ధంతి…..

TNR NEWS

_పెద్దగట్టు జాతర సందర్భంగా జాతీయరహదారి (ఎన్ హెచ్) 65 పై వాహనాల మళ్లింపు కు రూట్ మ్యాప్ విడుదల చేసిన సూర్యాపేట జిల్లా పోలీసు_

Harish Hs