Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంపీడీవో

మునగాల మండల కేంద్రంలోని స్థానిక మోడల్ స్కూల్ లో మధ్యాహ్న భోజనాన్ని సోమవారం ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్,ఏపీవో శ్రీనివాస్ పరిశీలించారు.విద్యార్థులతో మాట్లాడుతూ భోజనం ఎలావుందీ అని అడిగి తెలుసుకున్నారు.అనంతరం మధ్యాహ్న భోజన నిర్వాహకులతో మాట్లాడుతూ విద్యార్థులు తినే భోజనం వండే సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు.అదేవిధంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని నిర్వాహకులకు తెలిపారు. భోజనం నాణ్యత విషయంలో ఎటువంటి ఫిర్యాదులు వచ్చిన ఉపేక్షించే పరిస్థితి లేదని హెచ్చరించారు.ఉపాధ్యాయులు కూడా మధ్యాహ్న భోజనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నారు. ప్రభుత్వ మెనూ ప్రకారం రుచికరమైన భోజనాన్ని విద్యార్ధులకు అందించాలని సూచించారు.అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

Related posts

రజకుల సంక్షేమానికి బడ్జెట్ పెంచాలి

TNR NEWS

గడ్డి వాము దగ్ధం

TNR NEWS

కనుల పండువగా అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు

TNR NEWS

ట్రాన్స్ఫార్మర్ లో కాపర్ వైర్ దొంగతనం చేస్తున్న 4గురు దొంగలు అరెస్ట్

Harish Hs

కాలేయ వ్యాధులను నిర్లక్ష్యం చేయవద్దు

TNR NEWS

లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి

TNR NEWS