మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి భారీగా పొగమంచు కురిసింది. దీంతో గ్రామాలలో పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.పాఠశాలకు వెళ్లే విద్యార్థులు కూడా చలికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.చలి నుంచి ఉపశమనం పొందేందుకు గ్రామాలలో గ్రామస్తులు చలి మంటలు వేసుకున్నారు.