కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఆదివారం కోదాడ పట్టణంలో కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన గ్రాండ్ టెస్ట్ విజేతల పేర్లను సోమవారం సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ మీడియాకు వెల్లడించారు.ఈ గ్రాండ్ టెస్టులో ఆరు మండలాల నుంచి 95 మంది పదవ తరగతి విద్యార్థులు గ్రాండ్ టెస్ట్ లో పాల్గొన్నట్లుగా తెలిపారు. మొదటి బహుమతి జడ్పిహెచ్ఎస్ పాలవరం మట్టపల్లి పల్లవి,రెండవ బహుమతి టి జి ఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ మునగాల (నెమలిపురి కాలనీ) వల్లపు దాసు స్టాలిన్ , మూడవ బహుమతి జడ్.పి.హెచ్.ఎస్ నడిగూడెం షేక్ నజిమిన్ ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచినట్లుగా తెలిపారు.గ్రాండ్ టెస్ట్ ను విజయవంతంగా నిర్వహించిన ఎలక్ట్రాన్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు ను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం రఘు మాట్లాడుతూ… త్వరలోనే స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చేతుల మీదుగా విజేతలకు బహుమతుల అందజేయనున్నట్లు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు రఘు తెలిపారు.