Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

ప్రజల ముంగిట్లో ఎనిమిది సంక్షేమ పథకాలు… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుంది..  పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు

పెద్దపల్లి జిల్లా.కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో బుధవారం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన జనవరి 26 నుండి అమలు చేసే రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు నాలుగు సంక్షేమ పధకాల అమలు కార్యక్రమంలో భాగంగా గ్రామ సభకు ముఖ్య అతిధిగా హాజరైన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణా రావు ..

 

ఈ సందర్బంగా గౌరవ ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ..

 

గత ప్రభుత్వంలో కరెంటు బిల్లులు కట్టలేక ఇబ్బంది పడ్డ ప్రజలకు 200 యూనిట్ల విద్యుత్ మాపీ చేసి సుమారు 80 శాతం మంది ప్రజలు కట్టే విద్యుత్ బిల్లు ప్రభుత్వం భరిస్తుంది అని అన్నారు. గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు రాక ప్రజలందరికీ ఎంతో ఇబ్బంది పడ్డారని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి రేషన్ కార్డులు ఇచ్చారని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు లేని వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వడం జరుగుతుంది అన్నారు. ఇల్లు లేని వారికి సొంత ఇంటి స్థలం ఉంటే 5 లక్షలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించడం జరుగుతుంది అన్నారు. మండల కేంద్రంలో ఉన్న 278 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇక్కడ ఇల్లు లేని వారందరికీ ఇవ్వడం జరుగుతుంది అన్నారు. ఈ నియోజకవర్గానికి ప్రతి సంవత్సరానికి 3500 ఇండ్లు మంజూరు కావడం జరుగుతుందని నాలుగు సంవత్సరాలుగా దశలవారీగా ఇండ్లు లేని వారందరికీ ఇవ్వడం జరుగుతుంది అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ నాలుగు సంక్షేమ పథకాలు ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఎంపిక చేయడం జరిగింది అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు చేసిన వాగ్దానాలన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చడం జరుగుతుంది అన్నారు. భూమిలేని నిరుపేదలందరూ ఉపాధి హామీలో సంవత్సరానికి 20 రోజుల పని దినాలు చేసి ఉంటే వారికి ప్రభుత్వం ఆరు నెలకు 6000 చొప్పున 12000 ఇవ్వడం జరుగుతుంది అన్నారు. గత ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో రైతులు పండించిన వడ్లకు ఐదు కిలోల నుంచి 20 కిలోల వరకు క్వింటాలకు కట్ చేసి రైతులను నిలువున ముంచింది అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ నియోజకవర్గంలో రెండు పంటల వరి ధాన్యముకు గింజ కటింగు లేకుండా కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేయించి రైతులను ఆదుకున్నాను అన్నారు. ఈ నియోజకవర్గంలో సన్న వడ్లకు 52 కోట్లు రైతులకు బోనస్ పడ్డాయని, మిగిలిన రైతుల మరో ఆరు కోట్ల 40 లక్షల బోనస్ త్వరలో పడుతుంది అన్నారు. గత ప్రభుత్వం అధికారంలో ఉండి ఈ రాష్ట్రంలో ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసిందని, ఈ అప్పు భారాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రజల మీద ఎలాంటి పన్ను వేయకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు అన్నాడు. టేలాండ్ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు నాతోపాటు మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ కష్టపడుతున్నాడని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా సారయ్య గౌడ్ ను సభాముఖంగా అభినందించారు. ఎస్సారెస్పీ కాలువ కు మరమతుల చేసేందుకు 49 లక్షలు ప్రతిపాదనలు చేయడం జరిగిందని కాల్వ షటర్ కోసం 29 లక్షలు కూడా మంజూరికి మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి కానుకూలంగా స్పందించారని, ఈ మరమ్మతులు పూర్తయితే 200 క్యూసెక్కుల నీరు ఎస్సారెస్పీ కాల్వ ద్వారా హోస్సేన్ మియా వాగులోకి కేవలం మూడు రోజుల్లోనే వచ్చి పెద్దరాతుపళ్లి వరకు సాగునీరు అందుతుంది అన్నారు. మేము ప్రజా పాలకులను కాదు సేవకులమని ఎప్పుడు ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

 

ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీ మాల, ఎంపీడీవో రామ్మోహనాచారి, తహసిల్దార్ ఎండి వకీల్, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్,మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, గజానావేణి సదయ్య, తులా మనోహర్ రావు,సబ్బని రాజమల్లు,అల్లం దేవేందర్, పులి ఇంద్ర కర్ణన్ రెడ్డి,బంగారి రమేష్, మాధసు సతీష్, రానవేనా శ్రీనివాస్,సోనాయిటెంకం శివ,రావి సాధనందం, క్రాంతి,

మరియు ఎంపీ ఓ కిరణ్ గ్రామ కార్యదర్శి సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అధ్వాన్న స్థితిలో దౌల్తాబాద్ పాఠశాల.

TNR NEWS

చదువుల సరస్వతి సావిత్రిబాయి పూలే 

TNR NEWS

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

TNR NEWS

ప్రతిభ చూపితే ఉద్యోగ అవకాశాలు

TNR NEWS

మద్నూర్ లో మహాత్మా గాంధీ వర్ధంతి

TNR NEWS

విద్యార్థులకు గణిత ప్రతిభా పరీక్షలు

TNR NEWS