క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి కే సురేష్ అన్నారు. సోమవారం కోర్టు ఆవరణలో ఫిబ్రవరి 4 అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో వైద్యులు డాక్టర్ గంటా నాగమణి, డాక్టర్ జూకూరి సంజవ్ కుమార్ తో కలిసి న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి, కక్షిదారులకు క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. మన శరీరంలో జరిగే మార్పులను గమనించుకుంటూ తరచూ డాక్టర్లను సంప్రదించి పరీక్షలు చేపించుకోవాలన్నారు. క్యాన్సర్ వ్యాధి ముదరకముందే ముందస్తుగా గుర్తిస్తే చికిత్స సులభం అవుతుందని తెలిపారు. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వేకల్ క్యాన్సర్ల గురించి వివరించారు. పురుషుల్లో ధూమపానం, మద్యపానం, పొగాకు, మత్తుపదార్థాలు వాడటం వ్యాయామం లేకపోవడం వంటి అలవాట్ల వలన క్యాన్సర్ మహమ్మారి సోకుతుందన్నారు. సరైన జీవనశైలితో జీవన విధానంలో మార్పులతో క్యాన్సర్ వ్యాధిని నివారించవచ్చని తెలిపారు. క్యాన్సర్ వ్యాధిపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చిత్తలూరి సత్యనారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ ఆర్ కె మూర్తి, ఉపాధ్యక్షులు గట్ల నరసింహారావు, కె.వి చలం, దొడ్డ శ్రీధర్, ఉయ్యాల నరసయ్య, మురళి, మోష, దావీద్, మంద వెంకటేశ్వర్లు, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు………