సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలోని ఉపాధ్యాయీనీలను మండల కాంగ్రెస్, సిపిఐ పార్టీలకు చెందిన నేతల పలువురు శుక్రవారం శాలువాతో సన్మానించారు. అంతకుముందు వారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రేవతి, వడ్లకొండ శ్రీనివాస్, కాంగ్రెస్ సిపిఐ పార్టీ నేతలు రావుల నరసయ్య, యూత్ కాంగ్రెస్ నేత శానగొండ శరత్, జెల్లా ప్రభాకర్, బోనగిరి రూపేష్, సంగెం మధు, పోతిరెడ్డి వెంకటరెడ్డి, దొంతర వేణి మహేష్, చింతకింది పరశురాములు, బొనగం రమేష్, వడ్లూరి పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.
previous post