కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలం గోర్గల్ గ్రామస్తులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు.వారం నుండి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిజాంసాగర్ మండలం గోర్గల్ గ్రామం లోని దళిత వాడలో నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ట్రాన్స్ ఫార్మర్ చెడిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దళితవాడలో నీటి ఎద్దడి సమస్య ఎక్కువైందని వాపోయారు. కుళాయిలు రాక రోజంతా నీళ్ల కోసం చెరువుకు లేదా పొలాల్లోని బోరుల వద్దకు వెళ్లాల్సి వస్తుందని మిషన్ భగీరథ నీరు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు సమస్యను విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు.వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.