Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్పుణ్యక్షేత్రాలు

కాకినాడగణపతిపీఠంలో 53మంది ఉపవాసకులతో ఘనంగా జరిగిన మాఘ సంకష్టహర చతుర్థి

కాకినాడ : స్వయంభు కాకినాడ భోగిగణపతి పీఠంలో మాఘమాస సంకష్ట హరచతుర్ధి మాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 53మంది చతుర్థి ఉపవాసకులు ప్రత్యేక పూజలు చేసారు. 13వ చతుర్థి సందర్భంగా మంగళ వాయిద్యాల నడుమ జై గణేశ జయము జయము పరమేశ్వర నామాలతో నగర సంకీర్తన సహస్ర నామ పారాయణ చేశారు. పంచామృతాలతో గణపతిని అభిషేకించి, అఖండ హారతి అందించారు. నల్లద్రాక్షలతో పాలవెల్లిని నిలిపి తరుణ గణపతిని ప్రతిష్టించారు. మాఘ మాసంలో సంకష్ట హార చతుర్థి ఉపవాస వ్రత పూజవలన సర్వ దేవతల వ్రత యజ్ఞ యాగ ఫలాలతో బాటుగా జన్మించిన జీవిత లక్ష్యసాధనకు పరమార్థ సార్థకమైన వరప్రదాయక ఏకాగ్రత కార్యసిద్ధి కలుగుతుందని పీఠం తెలియజేసింది. చంద్రునికి ఆర్ఘ్యంతో నీరాజనాలు సమర్పించిన వ్రతదీక్ష ఉపవాసకులకు అల్పాహార సమారాధన ఏర్పాటు చేశారు. స్వయంభువుకి పంచలోహాల తాపడంతో కాంస్య కవచ యజ్ఞం జరిగిన సందర్భగా 24 నెలల పాటు ఉపవాసకులతో చతుర్థి మాసోత్సవాలు ప్రత్యేకంగా జరుగుతున్నాయని పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు.

Related posts

ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో సినిమా ట్రైలర్ ఆవిష్కరణ

TNR NEWS

జాతీయ మహిళా కమిషన్ కొత్త ఛైర్ పర్సన్ గా విజయా కిశోర్

TNR NEWS

నిండ్ర చక్కెర ఫ్యాక్టరీ వద్ద లారీల ఢీ

TNR NEWS

త్రేతాయుగ ప్రతీక “భద్రాచల పాదయాత్ర” – 14వార్షికాలు పూర్తి చేసిన గురుస్వామి వాసుదేవ ఆచార్యను సత్కరించిన గణపతి పీఠం

Dr Suneelkumar Yandra

కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి – ఎఐటియుసి డిమాండ్

Dr Suneelkumar Yandra

మాదక ద్రవ్యాలు మీద అవేర్నెస్ క్యాంపు యువతకి చాలా ఉపయోగకరం – పట్టణ సిఐ జి.శ్రీనివాస్

Dr Suneelkumar Yandra