కాకినాడ : అన్నవరం సత్యదేవుని క్షేత్రంలో భక్తుల అసౌకర్యాల పరిష్కారానికి ప్రతి నెలా స్వయంగా సమీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిర్ణయించడం పట్ల కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠం హర్షం వ్యక్తం చేసింది. భక్తులకు అన్నప్రసాద నిర్వహణలో కూర్చుని తినే విధానంతో బాటుగా బఫే ఏర్పాటు కూడా ప్రారంభించాలని ఆదేశించడం అభినందనీయమన్నారు. అన్నవరం క్షేత్రంలో భక్తుల సమస్యల పరిష్కారానికి వాట్సప్ నెంబర్ ద్వారా పరిష్కరించే కంప్లయింట్ సెల్ నిర్వహణ ఏర్పాటు చేయాలని పీఠం ఉపాసకులు సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు జిల్లా కలెక్టర్ కు లేఖ వ్రాసారు.