- నాగబాబు చేతుల మీదుగా ప్రదానం
పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గం పాదగయ క్షేత్రంలో ఇటీవల జరిగిన మహా శివరాత్రి వేడుకలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి నిర్విఘ్నంగా నిర్వహించడానికి తోడ్పడిన పిఠాపురం పోలీస్ సిబ్బందికి ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం శాసన సభ్యుడు కొణిదల పవన్ కళ్యాణ్ ప్రశంసా పత్రాలు పంపారు. ఈ ప్రత్యేక ప్రశంసా పత్రాలను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు కొణిదల నాగబాబు చేతుల మీదుగా చేబ్రోలులో శుక్రవారం పోలీస్ సిబ్బందికి అందజేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ జి.బింధు మాధవ్ ఆదేశాలకు అనుగుణంగా పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది సత్కారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ పాల్గొని పోలీస్ సిబ్బందిని అభినందించారు.