- నేడు ఉచిత మెగా వైద్య శిబిరం
పిఠాపురం : ఆరోగ్యంపై ప్రతీ ఒక్కరికీ శ్రద్ధ అవసరమని, ప్రస్తుతం ఆరోగ్యంపై ప్రజలు నిర్లక్ష్యం చేస్తున్నారని రియాన్స్ క్లినిక్ డాక్టర్ వెంకటేశ్వర సతీష్ కుమార్ అన్నారు. ప్రతి వ్యక్తికి తన జీవితంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో అవసరం. కానీ నేటి ఆధునిక సమాజంలో ప్రజలు ఆరోగ్యాన్ని పట్టించుకోవడంలేదు. వారి కోసం ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు పలు స్వచ్ఛంధ సంస్ధలు అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాయి. అదే విధంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. మార్చి 3వ తేది సోమవారం పిఠాపురం పట్టణంలోని రాజావారి కోటలో వున్న జై సంతోషిమాత దేవాలయం వద్ద చిత్రాడ గ్రామానికి చెందిన పచ్చాల తాతారావు ఆధ్వర్యంలో కాకినాడకు చెందిన రియాన్స్ క్లినిక్ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని పిఠాపురం నియోజకవర్గం ప్రజలు అందరూ సద్వినియోగపర్యుకోవాలని డాక్టర్ వెంకటేశ్వర సతీష్ కుమార్ తెలిపారు.