పిఠాపురం : సోమవారం పిఠాపురం పట్టణంలోని రాజావారి కోటలో వున్న జై సంతోషిమాత ఆలయం వద్ద చిత్రాడ గ్రామానికి చెందిన పచ్చాల తాతారావు ఆధ్వర్యంలో కాకినాడకు చెందిన రియాన్స్ క్లినిక్ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని రియాన్స్ క్లినిక్ డాక్టర్ వెంకటేశ్వర సతీష్ కుమార్ ప్రారంభించారు. అనంతరం శిబిరానికి విచ్చేసిన రోగులకు ఉచితంగా వైద్య పరిక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి సుమారు 150 మందికి పైగా విచ్చేసి వైద్య పరీక్షలు చేయించుకున్నారని డాక్టర్ వెంకటేశ్వర సతీష్ కుమార్ తెలిపారు. ధీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కాకినాడలోని తమ క్లినిక్ విచ్చేస్తే పరీక్షలు చేసి, తగు చికిత్స అందిస్తామన్నారు. అందరికీ అందుబాటులో వైద్యం అందించాలనే సదుద్ధేశ్యంతో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.