ఆయనకు సంగీతం, సాహిత్యం పట్ల ప్రత్యేక అభిమానమని వక్తలు వెల్లడి
పిఠాపురం : సహృదయ మిత్రమండలి వారి ఆధ్వర్యంలో కీర్తిశేషులు డాక్టర్ గజరావు సీతారామస్వామి సంతాప సభ పిఠాపురం భారత్ పబ్లిక్ స్కూల్ పుల్లయ్య కాలవ వీధి నందు జరిగింది. ఈ కార్యక్రమానికి మిత్రమండలి అధ్యక్షులు తోట శ్రీనివాస్ అధ్యక్షత వహించగా పి.గంగాపావని (నివాళి గీతాలపన మృత్యువ నీవెంత టక్కరివి) చేశారు. పలువురు సాహితీ మిత్రులు, చిన్ననాటి స్నేహితులు, బందువర్గం ఈ కార్యక్రమానికి హాజరై డాక్టర్ గజరావు సీతారామస్వామి సేవా కార్యక్రమాలు, సంగీతం, సాహిత్యం పట్ల ప్రత్యేక అభిమానం గురించి, గుప్త దానాలు గురించి, సామాజిక సేవ అభ్యుదయ భావాల గురించి వివరించారు. సహృదయ మిత్రమండలి ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే ఒక వ్యక్తి మనందరిని వదిలి వెళ్లిపోవడం చాలా బాధాకరం, విచారణకరం అన్నారు. సహృదయ మిత్రమండలికి తాను ఏ విధమైన కార్యక్రమం తలపెట్టిన దానికి డాక్టర్ సీతారామస్వామి అడిగిన వెంటనే కాదనికుండా వేసవి శిక్షణ తరగతుల నుండి ఆరోగ్య శిబిరాల వరకు తమ వంతు సాయం చేస్తూ ఉండేవారని తెలియజేశారు. ప్రముఖ కవి అద్దేపల్లి ప్రభు మాట్లాడుతూ ఆయన చేసిన సేవ అజరామమం.. మనిషి లేకపోయినా ఆయన చేసిన పనులు మరింత కాలం గుర్తుంటాయి. ఆయన సేవలను ఎవరు మర్చిపోలేరు ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. మరొక ప్రముఖ కవి, యువ రచయిత అవధానుల మణిబాబు మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశీలి, సంగీతానికి, సాహిత్యానికి, నృత్యానికి వారధి డాక్టర్ సీతారాం స్వామి వదికిపోవడం ఆయన గొప్పతనం అన్ని రంగాలకు ఆయన లేకపోవడం తీరంలోని తెలియజేశారు. సంతాప సభ తీర్మానం హాజరైన సభ్యులు సమక్షంలో ప్రతి సంవత్సరం కీర్తిశేషులు డాక్టర్ గజరావు సీతారామ స్వామి వర్ధంతి రోజున ఘనమైన సాహితీ సభను ఆయన పేరు మీద ఏర్పాటు చేయాలని నిర్వహించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమానికి తోట శ్రీనివాస్, చిన్నారి సతీష్, గంగాపావని, మేకా మన్మధరావు, అద్దేపల్లి ప్రభు, గట్టి శ్రీకృష్ణదేవరాయులు, పిఠాపురం మహారాజా తనయుడు నాయన బాబు, నేమిచెట్టి గంగబాబు, డాక్టర్ నక్కా సూర్యనారాయణ, బండి రాజ్కుమార్, అవధానుల మణిబాబు, కొరుప్రోలు గౌరీ నాయుడు, చైతన్య మిరియాల, వరద వీరభద్రరావు, కొమ్మనపల్లి అప్పారావు మొదలైన వారు ఈ కార్యక్రమానికి హాజరై డాక్టర్ గజరావు సీతారామ స్వామి పట్ల ఉన్న ప్రేమను వారితో ఉన్న పరిచయాలను అనుభవాలను పంచుకోవడం జరిగింది.