పిఠాపురం : జనసేన పార్టీ అధ్యక్షుడు, పిఠాపురం నియోజవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ తో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు భేటీ అయ్యారు. సోమవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పెండెం దొరబాబు తమ కుటుంబ సభ్యులతో కలసి పవన్ కళ్యాణ్ తో చర్చించారు. జనసేన పార్టీలో చేరేందుకు పెండెం దొరబాబు ఆసక్తి వ్యక్తం చేయగా అందుకు పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపారని పార్టీ కేంద్ర కార్యాలయం తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. మార్చి 14వ తేదీన పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జరగబోయే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో పార్టీ కండువా కప్పుకోనున్నట్టు విశ్వసినీ వర్గాలు సమాచారం.

next post