రేవంత్ రెడ్డి సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదిన కానుకగా రాష్ట్ర సచివాలయం ముందు నూతనంగా ఆవిష్కరణ చేసిన తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ రాష్ట్ర ప్రజల అధికారిక విగ్రహం కాదని కేవలం కాంగ్రెస్ పార్టీ తల్లి మాత్రమేనని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుంకర అజయ్ కుమార్, మునగాల పిఎసిఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ అన్నారు,
మంగళవారం బిఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు మునగాల మండల బిఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ప్రస్థానంలోనే తెలంగాణ తల్లి ఆవిరిభవించింది అని, నాడు ప్రజల ఉద్యమ ఆకాంక్షలకనుగుణంగా తెలంగాణ తల్లిని కేసీఆర్ నాయకత్వంలో ఆనాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారులు తీర్చిదిద్దితే, నాటి మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఏమాత్రం పాత్రలేని ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న డిసెంబర్ 9న రాష్ట్ర సచివాలయంలో నూతనంగా ప్రతిష్టించిన తెలంగాణతల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ తల్లి గాని పరిగణిస్తాం అని వారన్నారు, ఉద్యమ ఆకాంక్షల నుండి పుట్టి స్వరాష్ట్రాన్ని సాధించడానికి కీలకపాత్ర పోషించిన నాటి తెలంగాణ తల్లి విగ్రహమే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అభిమాన తెలంగాణ తల్లి అని, తెలంగాణ రాష్ట్ర ప్రతి అణువణువునా కేసీఆర్ ముద్ర ఉంటుందని, గత 10 సంవత్సరాల కెసిఆర్ పరిపాలనలో తెలంగాణ ప్రజల అభివృద్ధి ప్రదాత కేసీఆర్ ముద్ర చెడపడం రేవంత్ రెడ్డి వల్ల కాదు అని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మునగాల పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ, ఎల్ పి రామయ్య, నాగిరెడ్డి, చెన్నారెడ్డి,చీకటి శ్రీను, వల్లోజు వసంత కుమార్, దేవులపల్లి అంజి, గురుమూర్తి, నారగాని వెంకన్న, గడ్డం లక్ష్మీనారాయణ, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.