లేటెస్ట్ గా మన తెలుగు సినిమా దగ్గర వచ్చి సెన్సేషనల్ వసూళ్లతో అదరగొట్టిన చిత్రాల్లో దర్శకుడు అనీల్ రావిపూడి అలాగే వెంకీ మామ కలయికలో వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. రీజనల్ గా ఇండస్ట్రీ హిట్ అయ్యిన ఈ సినిమా రీసెంట్ గానే ఓటిటిలోకి కూడా వచ్చి రికార్డులు బ్రేక్ చేసింది.అయితే థియేటర్స్ లో భారీ లాంగ్ రన్ ని అందుకున్న ఈ చిత్రం ఇపుడు 50 రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఒకప్పుడు అంటే థియేటర్స్ లో 50 రోజులు, 100 రోజులు సెంటర్స్ అని ఎంతో గ్రాండ్ గా చెప్పుకునే రోజులు ఉండేవి. కానీ ఇపుడు వసూళ్లు మాత్రమే లెక్కేస్తున్నారు. అయితే వీటితో పాటుగా చెప్పుకునే రేంజ్ సెంటర్స్ లోనే సంక్రాంతికి వస్తున్నాం 50 రోజులు పూర్తి చేసుకుంది.ఇలా ఈ చిత్రం ఏకంగా 92 సెంటర్స్ పూర్తి చేసుకోవడం విశేషం. దీనితో దర్శకుడు అనీల్ రావిపూడి ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు తెలుగు ఆడియెన్స్ కి అలాగే తన సినిమా కోసం నిలబడ్డ డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన హీరో వెంకీ మామ, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ లు సహా హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి వీరితో సంగీత దర్శకుడు భీమ్స్ కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.