అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను పురస్కరించుకొని శనివారం కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో సంఘ మహిళా కార్యదర్శి భ్రమరాంబ అధ్యక్షతన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ హోదాల్లో స్థిరపడిన మహిళలకు సంఘ అభివృద్ధి కోసం కృషి చేసిన మహిళలను గుర్తించి ఘనంగా సన్మానించారు. కాగా ఈ వేడుకల్లో మాజీ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల పాల్గొని మాట్లాడారు.నేటి సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారని తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో ఆడ, మగా అనే వివక్ష చూపకుండా పెంచాలని అన్నారు. ఓర్పు, సహనం మహిళలకు వరం లాంటిది అన్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ప్రేమ, ఆప్యాయతలు చూపి పిల్లలకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య, కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, మహిళలు చందా నిర్మల,లక్ష్మీ సామ్రాజ్యం, శోభారాణి,మణెమ్మ,అక్కమ్మ, మాధవి, విజయలక్ష్మి, వీరమని తదితరులు పాల్గొన్నారు………..