కాకినాడ : నల్లమల అడవుల్లో ఆధ్యాత్మిక దివ్యానుభూతి కలిగించే అవధూత కాశి నాయన జ్యోతి క్షేత్రాన్ని పరిరక్షించాలని కాకినాడ స్వయంభూ భోగిగణపతి పీఠం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ వ్రాసింది. నాలుగున్నర దశాబ్దాలుగా ధార్మిక సేవలు జరుగుతున్న క్షేత్ర వైభవాన్ని భవిషత్తు తరాలకు అందించాలన్నారు. చరిత్ర పూర్వ నుండి దేశంలోని అనేక అటవీ ప్రాంతాల్లో అనేక ఆధ్యాత్మిక ప్రదేశాలు వున్నాయని వాటి నియమాలు నిబంధన లు అమలు చేయడం ద్వారా కాశి నాయన క్షేత్రం కాపాడాలని పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు కోరారు. అక్కడ వున్న 13హెక్టార్ల అటవీ భూమిని అటవీ చట్టం నుంచి మినహాయించాలని మాజీ ముఖ్య మంత్రులు కోట్ల విజయ భాస్కర రెడ్డి, ఎన్.టి.రామారావు హయాం నుండి కేంద్రాన్ని కోరుతున్న వినతిని ఆమోదించాలన్నారు. ఏకపక్షంగా క్షేత్రంలో జరుగుతున్న కూల్చివేతలను నిలుపుదల చేయాలన్నారు.