- ఇతర రాష్ట్రాల నుండి సభకు వచ్చేవారికి తగిన వసతులు కల్పించాం
- ఏపీ టిడ్కో చైర్మన్, జనసేన జాతీయ మీడియా ఇన్చార్జ్ వేములపాటి అజయ్ కుమార్
పిఠాపురం : ఈనెల 14వ తేదీన చిత్రాడలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని ఏపీ టిడ్కో చైర్మన్, జనసేన పార్టీ జాతీయ మీడియా ఇన్చార్జ్ మరియు జనసేన సీనియర్ నాయకులు వేములపాటి అజయ్ తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 12వ ఆవిర్భావ దినోత్సవ సభ పిఠాపురం నియోజకవర్గంలో జరుపుకోవడం ఒక చారిత్రాత్మక ఘట్టమని, పార్టీ స్థాపించిన నాటి నుండి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నామన్నారు. ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించడం జరిగిందన్నారు. ఎన్నికల్లో కూటమి గెలుపు కేంద్రంలో ఎన్ డి ఎ అధికారంలోకి రావడంలో ఒక ప్రధాన భూమిక పోషించిందని, ఎన్నికల్లో తమను ఈ రాష్ట్ర ప్రజలు స్వాగతించారని, పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో పార్టీ ఆవిర్భావ సభ జరగనుండడంతో దేశవ్యాప్తంగా ఉన్న జనసేన నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఆవిర్భావ సభకు దేశ నలుమూల నుంచి రానున్న జనసైనికుల కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో పండగ వాతావరణంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగబోతుందని, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు గత పదిరోజులుగా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నామన్నారు. అధినేత ఆదేశాలతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని తెలిపారు. ఈ పాత్రికేయ సమావేశంలో చోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్, అవిర్భవ సభ సమన్వయ కర్త పి.ఎస్.ఎన్.రాజు, జనసేన నాయకులు పిల్లా శ్రీధర్, ఊటా నాని బాబు, పిల్లా శివశంకర్, జ్యోతుల సతీష్, ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.