ఆలమూరు : పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయాలని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్, ఆవిర్భావ సభ నియోజకవర్గ సమన్వయకర్త సుంకర కృష్ణవేణి పిలుపునిచ్చారు. ఆలమూరు మండలం చెముడు లంక, పినపళ్ల గ్రామాలలో జనసేన పార్టీ సమీక్ష సమావేశాలు నిర్వహించారు. జన సమీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశాలకు బండారు శ్రీనివాస్, సుంకర కృష్ణవేణి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ నెల 14న పిఠాపురంలో జరిగే ఆవిర్భావ దినోత్సవ సభ విజయవంతం చేయడానికి కొత్తపేట నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలన్నారు. పిఠాపురం సభకు వెళ్లే కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాహనాలు, భోజన సదుపాయాలు సక్రమంగా ఏర్పాట్లు చేపట్టినట్టు వారు వివరించారు. క్రమశిక్షణతో సభకు వెళ్లి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశాలలో సూరపరెడ్డి సత్య, సంగీత సుభాష్, గారపాటి శ్రీనివాస్ చౌదరి, కొత్తపల్లి నగేష్, నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, సలాది జయప్రకాష్ నారాయణ, కొప్పుల రామకృష్ణ, నామాల సుబ్బారావు, పడాల అమ్మిరాజు, నల్ల వెంకన్న, తోట వెంకటేశ్వరరావు, పెద్దిరెడ్డి పట్టాభి, బావిశెట్టి తాతాజీ, చల్లా బాబి, గుత్తుల నాగేశ్వరరావు, సిరిగినేడి పట్టాభి, కట్టా రాజు, చల్లా వెంకటేశ్వరరావు, బైరిశెట్టి రాంబాబు, జనసేన వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.