అమరావతి: ఏపీ అసెంబ్లీ పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలు మారనున్నాయి. తాజాగా చేసిన చట్ట సవరణ ప్రకారం ఎంత మంది పిల్లలున్నా నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది.
జనాభా వృద్ధిరేటు పెంపులో భాగంగా ఏపీ మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలకు నేడు శాసనసభలో ఆమోదం లభించింది. పంచాయతీ రాజ్ సహా పలు చట్టాలకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. మండలిలో ఈ బిల్లులకు ఆమోదం వచ్చాక, గవర్నర్ ఆమోదం పొందితే ఈ బిల్లులు చట్ట రూపం దాల్చనున్నాయి.