పిఠాపురం : 100 పర్సంట్ స్ట్రెక్రేట్ సాధించిన పార్టీగా నిలిచిన జనసేన పార్టీ మార్చి 14వ తేదీ ఆవిర్భవ దినోత్సవం సంధర్భంగా ఇప్పటికే పార్టీ శ్రేణులు ఏర్పాట్లు భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ చేస్తున్న కార్యాక్రమాన్ని ప్రజలకు చేరవేసేందుకు పలు వేదికల ద్వారా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా పిఠాపురం పట్టణానికి చెందిన రిటైర్డ్ ఎస్సై బొజ్జా లోవరాజు (నానాజీ) సుమారు 500లకు పైగా ఆటో స్టిక్కర్లను తన సొంత ఖర్చులతో ముద్రింపజేశారు. ఈ స్టిక్కర్లను పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఆవిష్కరించారు. బొజ్జా నానాజీ తన పదవీకాలం ఇంకా ఉన్నా పార్టీ మీద ఉన్న మక్కువతో, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆలోచనా విధానం నచ్చి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని పార్టీలో జాయిన్ అయ్యారని, ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని తెలిపారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ బొజ్జా కుమార్, ఏలేరు ప్రాజెక్టు ఛైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, జనసేన నాయకులు పిల్లా శివశంకర్, మధు, నక్కా శ్రీనివాస్ (బద్రి), వీరమహిళలు కేతీనిడి గౌరీమణి తదితరులు పాల్గొన్నారు.