పిఠాపురం : గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలోని ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాల నందు పాలిటెక్నిక్ విద్యార్థులు బుధవారం ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన జీవితం మన చేతిలోనే ఉందని తెలియజేస్తూ విద్యార్థుల అందరూ కూడా ఉన్నత స్థితికి ఎదగాలని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో ప్రణాళికబద్ధంగా విద్యాబుద్ధులు అలవర్చుకొని భవిష్యత్‌లో ఉన్నతంగా రాణించాలని సూచించారు. అనంతరం కళాశాల పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై.వి.ఎన్.రాజశేఖర్ మాట్లాడుతూ పెరుగుతున్న పోటీ ప్రపంచంలో విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా లక్ష్యం వైపే గురి ఉంచి దాని సాధన కోసం కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ బుర్రా అఖిలేష్, బీటెక్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.శ్రీనివాసరావు, అధ్యాపక బృందం మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.