April 5, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

బెట్టింగ్ మాఫియా డొంక లాగుతున్న పోలీసులు! నిర్వహుకులే అసలైన టార్గెట్..?

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో పోలీసులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. బెట్టింగ్ యాప్స్ యజమానులే టార్గెట్‌గా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బెట్టింగ్‌ కారణంగా ఆత్మహత్య చేసుకున్న బాధితుల వివరాలు సేకరించారు. బెట్టింగ్‌ ఊబిలో చిక్కుకుని ఒక్క ఏడాదిలో 15 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తెలంగాణ వ్యాప్తంగా 15 కేసులు నమోదు చేశారు. ఆయా బెట్టింగ్‌ యాప్స్ గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. బెట్టింగ్‌ యాప్స్ నిర్వాహకులు, ప్రమోటర్లను నిందితులుగా చేర్చనున్నారు. ఇప్పటివరకు 108 అక్రమ బెట్టింగ్‌ వెబ్‌సైట్లు బ్లాక్ చేశారు. మరో 133 బెట్టింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌కు నోటీసులు ఇచ్చారు. బెట్టింగ్ వెబ్‌సైట్లు తెలంగాణలో యాక్సెస్ కాకుండా జియో-ఫెన్సింగ్‌ టెక్నాలజీతో టి.జి.సి.ఎస్.బి (TGCSB) చర్యలు తీసుకుంటోంది. కాగా బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఇప్పటికే విష్ణుప్రియ, రీతూచౌదరి, తేస్టీ తేజ, కిరణ్‌గౌడ్‌లను పోలీసులు విచారించారు. శ్యామల, అజయ్ సన్నీ, సుప్రీత, సన్నీ సుధీర్‌లను విచారణ కోసం సంప్రదించగా వారి ఫోన్లు స్విచాఫ్‌ వచ్చినట్లు సమాచారం. అలాగే మరికొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా ఇంకా అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. విచారణ భయంతో హర్షసాయి, ఇమ్రాన్, భయ్యా సన్నీయాదవ్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బెట్టింగ్‌ యాప్స్ ప్రమోషన్స్‌తో సినీనటులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు భారీగా లబ్ధి పొందారని, అసలు వారికి ఏయే మార్గాల్లో డబ్బు వచ్చిందని పోలీసులు ఆరా తీస్తున్నారు.

Related posts

ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్.. ఎప్పటి నుంచి అంటే?

Dr Suneelkumar Yandra

పిఠాపురంలో నిర్వాసిత బడ్డీ యజమానులకు.. పి4 ప్రణాళికగా జనతా దుకాణాలు నిర్మించాలి

Dr Suneelkumar Yandra

శాంతిస్థాపనతోనే సామాజిక న్యాయం సాధ్యం

Dr Suneelkumar Yandra

ఢిల్లీలో పర్యటిస్తున్న మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ*

TNR NEWS

పిఠా‘‘పుర’’ంలో ఎన్నికల కోడ్‌ వర్తించదా…!? – చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు

Dr Suneelkumar Yandra

చోడవరం పర్యటనకు రావాలని నాగేంద్ర బాబుకు రాజు ఆహ్వానం