Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుంది

ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే గత బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతి కాంగ్రెస్ కు తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. బుధవారం సిపిఎం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని, ఎస్సారెస్పీ పరిధిలో ఎండిపోయిన వరి పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు సిపిఎం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి ప్రజలు అడగకున్నా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్న ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదని ఆరోపించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్ప ఏ ఆమె నేటికీ అమలుకు నోచుకోలేదు అని విమర్శించారు. రైతాంగానికి అరుణమాఫీ చేశామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం నేటికీ అనేకమందికి రుణమాఫీ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగానికి రైతు భరోసా పథకాన్ని అందించాల్సిన ప్రభుత్వం కేవలం రెండు ఎకరాలకు మాత్రమే రైతుబంధు ఇచ్చి చేతులు దులుపుకుందని అన్నారు. గృహలక్ష్మి పథకం క్రింద ప్రతి మహిళకు నెలకు2500 ఇస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికీ ఇవ్వలేదన్నారు. వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అందిస్తామని ఏడాదికి 12000 ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసిన పాపాన పోలేదన్నారు. ఇందిరమ్మ పథకం ద్వారా 5 లక్షల రూపాయలతో పేదల ఇండ్ల నిర్మాణం సాధ్యం కాదన్నారు. రాష్ట్రము, కేంద్రం కలిపి ఒక్క ఇంటికి 15 లక్షల చొప్పున ఇంటి నిర్మాణ వ్యయాన్ని పెంచాలన్నారు. ఉపాధి కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వం 200 రోజులు పనులు కల్పించి రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలన్నారు. ఉపాధి కూలీలు రెండు పూటలా హాజరు వేయాలని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. గత 11 సంవత్సరాలుగా రేషన్ కార్డు లేక రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు పత్రికలకే పరిమితమైన తప్ప ఆచరణలో పేదలకు రేషన్ కార్డులు అందలేదన్నారు. వృద్ధులు వితంతువులు వికలాంగులు ఒంటరి మహిళలు, చేతివృత్తిదారులు కొత్త పింఛన్లు రాక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జిల్లాలో వందలాది గ్రామాలలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలో అనేక గ్రామాలలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇల్లు పూర్తి కాకపోవడంతో శిథిలవస్తులోకి చేరుకున్నాయని ప్రభుత్వం తక్షణమే అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు బడ్జెట్ కేటాయించి పూర్తి చేయాలని కోరారు. కార్మికులకు కనీస వేతనం అమలు చేసి ఆదుకోవాలన్నారు. విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్ షిప్ లు, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం ఆస్తి పన్నును గ్రేటర్ హైదరాబాదులో 90 శాతం వడ్డీ మాఫీ అమలు చేస్తుందని రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలకు, నగర పంచాయతీలకు90 వడ్డీ మాఫీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సారెస్పీ ద్వారా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గ పరిధిలో ఎండిపోయిన వరి పంటలకు ఎకరాకు 30 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్నారు. సూర్యాపేట జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం కార్యకర్తలు కలెక్టరేట్ లో కి చుచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ వెంటనే రావాలని సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్వి నంద లాల్ పవర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నా సందర్భంగా ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన గేయాలు, కళారూపాలు ప్రజలను ఆకట్టుకున్నాయి.

 ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, నాగారపు పాండు, మట్టిపల్లి సైదులు, కోట గోపి జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల వెంకన్న, దండ వెంకటరెడ్డి, జె. నరసింహారావు, ధనియాకుల శ్రీకాంత్, వీరబోయిన రవి, కందాల శంకర్ రెడ్డి, కొప్పుల రజిత, మద్దెల జ్యోతి, బుర్ర శ్రీనివాస్, పులుసు సత్యం, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, షేక్ సైదా, బచ్చలకూర స్వరాజ్యం, బెల్లంకొండ సత్యనారాయణ, దుగ్గి బ్రహ్మం, పల్లె వెంకటరెడ్డి, వట్టెపు సైదులు, మిట్టగనుపుల ముత్యాలు, మేకన బోయిన శేఖర్, ప్రజా సంఘాల బాధ్యులు బచ్చల కూర రాంబాబు, తంగేళ్ల వెంకటచంద్ర, మర్రి నాగేశ్వరరావు, బోయిళ్ళ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

భారీ వర్ష సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

TNR NEWS

చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

TNR NEWS

వ్యాసరచన పోటీల్లో తెలంగాణ గురుకుల పాఠశాల విద్యార్థినిల విజయపరంపర

TNR NEWS

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

TNR NEWS

కెసిఆర్ ని కలిసిన నాగూర్ల

TNR NEWS

జూలపల్లి లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన బిజెపి నాయకులు..

TNR NEWS