తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని డిసిసి ఉపాధ్యక్షులు కోదాడ మాజీ సర్పంచ్ పారా సీతయ్య అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఫ్లెక్సీ కి పేద బడుగు బలహీన వర్గాల అందరి పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి రైతులు, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ ఎన్నో పథకాలను తీసుకువచ్చి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని తెలిపారు. రైతు భరోసా, బోనస్ పథకాలతోపాటు దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం పథకం అమలు చేసి ఉచిత బస్సు, ఉచిత కరెంటు, సబ్సిడీ గ్యాస్ వంటి పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ యడవెల్లి బాల్ రెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ తోట శ్రీను, హనుమంతరావు, కంపాటి శ్రీనివాస్, కాళిదాసు వెంకటరత్నం, పాలూరి సత్యనారాయణ, గుండెల సూర్యనారాయణ, కొవ్వూరి వెంకట్రావు, యాకోబు, కంబాల ప్రసాద్, కొమ్ము వెంకటేష్, సన్నీరు మురళి, చింతలపాటి శేఖర్, పొనుగోటి సైదులు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు…………