Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

స్కూల్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్

  • చేతులు, కాళ్ళకు గాయాలు… ఆసుపత్రిలో చికిత్స
  • మన్యంలో పర్యటన ముగిసిన తరవాత పవన్ కల్యాణ్ సింగపూర్ పయనం 

అరకు : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ కి ఈ విషయం తెలిసింది. పర్యటన నిలుపుదల చేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు, నాయకులు సూచించారు. అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని… కాబట్టి ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకొంటానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు. మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కల్యాణ్ విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

Related posts

పిఠా‘‘పుర’’ంలో ఎన్నికల కోడ్‌ వర్తించదా…!? – చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు

Dr Suneelkumar Yandra

మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలి

ఆరోగ్య భీమా ప్రీమియంపై జిఎస్టి భారం తగ్గించాలి – పౌర సంక్షేమ సంఘం డిమాండ్

Dr Suneelkumar Yandra

ఎన్నికల మేనిఫెస్టో అమలుపై ధైర్యంగా చెప్పండి. 

TNR NEWS

సినీయర్‌ ఫిల్మ్‌ జర్నలిస్టులకు ‘‘స్వాతిముత్యం’’ సత్కారాలు

Dr Suneelkumar Yandra

నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచ్ ప్రయాణాన్ని ప్రారంభించిన తెలంగాణ పర్యాటకశాఖ…..

Harish Hs