Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మద్దతు ధర కూడా రావట్లేదని వడ్లకి నిప్పు పెట్టిన రైతు

ఆరుకాలం ఎంతో కష్టపడి పండించిన వరి పంటకు కనీస మద్దతు ధర రావట్లేదని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం రాశికి నిప్పు పెట్టిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కోదాడ నియోజకవర్గ మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామానికి చెందిన బత్తుల లింగరాజు అనే రైతు 5 ఎకరాలు కౌలుకు చేసి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ‌కు 70 బస్తాల ధాన్యం తీసుకురాగా.. అతి తక్కువ ధర 1600 రూపాయలు పలకడంతో పెట్టిన పెట్టుబడి కూడా సరిగా రాలేదని రైతు ఆవేదన చెందాడు. దీంతో తాను తీసుకువచ్చిన ధాన్యం రాశికి నిప్పు అంటించి తగలబెట్టాడు. రెండు రోజులుగా అన్నం తినకుండా ధాన్యం రాశి వద్దే పడుకున్నానని.. కనీసం మద్దతు ధర కూడా రాకపోతే బ్రతికేది ఎలాగని అధికారులను ప్రశ్నించిన రైతు..

Related posts

నల్గొండ:- దామచర్ల మండలం వాడపల్లి వద్ద రోడ్డుప్రమాదం..!

TNR NEWS

కార్యకర్తలను కలుపుకొని బిజెపిని గెలుపు తీరాలకు చేరుస్తా… -పెద్దపల్లి మండల నూతన అద్యక్షుడు రమేష్

TNR NEWS

మునగాల ఎంపీఓ గుండెపోటుతో మృతి

TNR NEWS

సిఎం,మంత్రులు మల్లన్న సాగర్ నిర్వాసిత కాలనీలలో పర్యటించి వారి గోస వినాలి భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయకపొవడం అన్యాయం డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ 

TNR NEWS

ఉపాధి’ హామీ పథకంలో అవకతవకలు..!

TNR NEWS

డ్రగ్స్,సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

TNR NEWS