Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కోదాడలో ఘనంగా బక్రీద్ వేడుకలు

త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని కోదాడ పెద్ద మసీదు ఇమామ్ మౌలానా అబ్దుల్ రషాది అన్నారు. శనివారం బక్రీద్ పండుగ సందర్భంగా కోదాడ పట్టణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మాట్లాడారు. బక్రీద్ పండుగ ప్రవక్త ఇబ్రహీం భక్తి భావాన్ని విశ్వాసాన్ని త్యాగ భవనాలను సమాజానికి ప్రబోధిస్తుందన్నారు. ఈ పండుగ రోజున అల్లాకు ఇష్టమైన ఆచారం ఖుర్బానీ ఇవ్వడం అన్నారు. పండుగలోని పరమార్థం జంతువులను బలివడమే కాదని హృదయంలోని స్వార్థం అహంకారం భౌతిక ఆసక్తులను త్యాగం చేసి అల్లాకు దగ్గరవడమే అన్నారు. స్తోమత ఉన్న ప్రతి ముస్లిం తన సంపాదనలో కొంత త్యాగం చేసి పేదల ఆకలి తీర్చడం మానవత్వాన్ని వెలుగులోకి తేవడమే అన్నారు. సామూహిక ప్రార్ధన అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకొని సోదర భావాలు వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు బక్రీద్ సందర్భంగా పలు రాజకీయ పక్షాల నాయకులు ఈదుగా వద్ద ముస్లిం సోదరులకు స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక సాలార్జంగ్ పేట 9వ వార్డు మాజీ కౌన్సిలర్ షేక్ మదర్ సాహెబ్ సామూహిక ప్రార్థనల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లు షేక్ మదర్ సాహెబ్, షమ్మీ,ఖాజా, బాగ్దాద్, బాజాన్, అలీ భాయ్, ముస్తఫా, మజహార్, సాదిక్, తది తరులు ఉన్నారు….

Related posts

*కులదురహంకార హత్యకి*  *పాల్పడిన నిందితున్ని కఠినంగా శిక్షించాలి…*  *కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి డిమాండ్…*

TNR NEWS

ఆకాశమే హద్దుగా ప్రతి మహిళ ఎదుగాలే…

TNR NEWS

ప్రభుత్వ విజయాలు వివరించేందుకు కళాయాత్ర :   తెలంగాణ సాంస్కృతిక సారధి నర్సంపేట టీం లీడర్ నెల్లుట్ల సుమన్.

TNR NEWS

కోదాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

Harish Hs

క్రీడలతో మానసిక ఉల్లాసం

Harish Hs

సమర్థవంతంగా సర్వే చేయాలి

Harish Hs