సూర్యాపేట జిల్లాలో పొలం చదును చేస్తుండగా పురాతన శివలింగం బయటపడింది. చివ్వెంల మండలం తిమ్మాపురంలో రణబోతు బాధిరెడ్డి తన వ్యవసాయ భూమిలో జేసీబీతో చదును చేయిస్తుండగా పురాతన శివలింగంతో పాటు నాగపడిగ విగ్రహాలు జేసీబీకి తగలడంతో వాటిని జాగ్రత్తగా తీసి పక్కకు పెట్టి శుభ్రం చేశారు. తిమ్మాపురంతో పాటు, మోదీన్పురం పరిసర గ్రామాల నుంచి శివభక్తులు అక్కడకు చేరుకుని క్షీరాభిషేకం చేసి పూజలు నిర్వహించారు.