Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

రంగుల ప్రపంచం – సాధారణ మానవుని జీవితం చిద్రం

ఆశయం గొప్పదా, ఆలోచన గొప్పదా అంటే ఏం చెప్తాం..!?

ఆలోచనతో పుట్టిందే కదా ఆశయం.

అలాంటి ఆశయానికి పునాది అక్షరమైతే, అక్షరంతో సమాజాన్ని మార్చాలన్న ఆకాంక్ష పుడితే, కాలాన్ని, కలాన్ని ఆపడం ఎవరి తరం కాదు.

 

అలాంటి మార్పు కోసం తాపత్రయ పడుతున్న అక్షరాలే మన యువ కవయిత్రి ధాత్రి వి,ఆమె ఉపయోగించే పదబందం,అక్షరాలను అల్లే విధానం,ప్రతీ పదంలో కనిపించే ప్రశ్నల పరంపర,సమాజం కోసం తన వంతుగా కృషి చేసి ఎంతో కొంత మార్పు తీసుకురావాలన్న ఆమె సంకల్పబలం,ముక్కు సూటిగా మాటల బాణాలు విసిరేస్తుంది,మౌనాన్ని ఆశ్రయించదు ఈ యువ రచయిత్రి ,ప్రళయాన్ని తన కలం సిరాలో నింపి పదాల సునామీ పుట్టిస్తుంది…

 

ఇక కవిత్వం విషయానికి వస్తే

*******

సినీ (జగత్తు)

******

రంగు ముసుగు కప్పుకున్న ముఖం వెనుక

మత్తు విషం చిమ్మె కోరలు చూడు

ఇప్పుడు కొట్టండి, ఈలలు, చప్పట్లు

తెరమీద జనాన్ని ఉద్ధరించే నటనలు

తెర వెనుక మత్తు బాగోతాల ఘటనలు

ముని వేళ్లతో ముద్దాడే నీ అభిమాని గుండెను

మొండి గుణపాలతో చిద్రం చేశావు

కోరికే  రో, నమిలే రో అని

అంగాంగ ప్రదర్శనలు పొట్టకూటి కోసమా…?

 

మైనారిటీ తీరని పసివాళ్ళ నుండి

కాటికి కాళ్లు చాపే వారి వరకు

మీరిచ్చే మత్తు సందేశాలు ఇవేనా…?

 

యువత మెదళ్లలో కలుపుతీయాల్సిన మీరు

వారి మస్తిష్కాల్లో గంజాయి మొలకలు నాటుతున్నారు….

 

అన్నం ముద్ద కోసం కాక నీ వాడుతున్న సినిమాలక ఈ పరుగులు చేసే నీ అభిమానించే సందేశం ఇదేనా…?

 

నీ భాష యాస అలవర్చుకొని నీవంటే పడి చచ్చేవారు నీ లత్కోరు అలవాట్లను నేర్చుకోవాల్సిందేనా…?

నీవు మార్గ నిర్దేశకునివా…?

నీవు చూపే దారి ఇదేనా…?

 

ఓ అభిమాని..!! గమనించు ఇప్పటికైనా…

సారవంతమైన సినీ వ్యవసాయం చేయు

వేలూరు కున్న గంజాయి వృక్షాలను పెకిలివేయు…

 

ముఖ్య గమనిక : సినీ తారలను తప్పు పట్టాలని నా ఉద్దేశం కాదు.

 

రచయిత : ధాత్రి

******

ఒక మనిషి జీవితాన్ని ప్రేరేపణ చేసే విషయంలో స్నేహితులు, బంధువులు, సమాజం, చదువు, ఎంత ముఖ్యమో సినిమా కూడా అంతే ముఖ్యం…

మనిషి మానసిక ఉల్లాసాన్ని ఉత్తేజ పరిచేది సినిమా, నటీనటుల విన్యాసాలను,నటనను చూస్తూ వాళ్ళకు అభిమానులుగా మరతాం…

అలాంటి అభిమానమే ప్రస్తుత సమాజంలో ఎన్నో కుటుంబాలలో కుంపటి పెడుతుంది…

 

రంగు ముఖాన పూసుకుని తోలుబొమ్మలు ఆడే ఆ మనుషుల మనసుల్లో మత్తు విషయం చిమ్మిన కోరలు చూసావా…!?

 

తెరమీద జనాన్ని ఉద్ధరించే నటనలు తెర వెనుక మత్తు బాగోతాల ఘటనలు, నీతి సూక్తులు చెప్పే ఆ తోలుబొమ్మలు, నీతి మీద న్యాయం మీద నిలబడకుండా చేసే అన్యాయాలు, ఘోరాలు కనులకు కనిపిస్తుంటే ఎంతో ప్రేమగా అభినందించే అభిమాని గుండె బద్దలు కాకుండా ఉంటుందా…!?

 

అసభ్యకరమైన వాక్యాలు వాడుతూ అంగంగాన్ని ప్రదర్శిస్తూ పొట్టకూటి కోసం ఈ రకమైన పనులు చేయడం అవసరమా..!?

అంటూ మన యువ కవయిత్రి సినీ రంగంలో జరుగుతున్న అన్యాయాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు…

 

మంచి సందేశాన్ని ఇస్తూ యువత మెదడులో కలుపుతీయాల్సిన మీరు వారి మస్తిష్కాల్లో గంజాయి మొలకలు నాటుతున్నారు, అంటూ సమాజం ,యువత మత్తుకి ఏ విధంగా బానిస అవుతుందో చెప్పారు…

 

సందేశాత్మక చిత్రాలు చూస్తే అలాగే వారి జీవితాన్ని కూడా మార్చుకుంటున్నారు ప్రస్తుతం ఉన్న యువత, అలాంటిది డ్రగ్స్, గంజాయి, ఆల్కహాల్ అంటూ ఇలాంటి మత్తు పదార్థాలను ప్రమోట్ చేస్తూ వస్తున్న సినిమాల కారణంగా ఎందరో అభిమానులు, మనుషులు అలాంటి వాటికి ప్రేరేపితులై సినిమా సందేశం ఇచ్చిన మార్గంలోనే అడుగులు వేస్తున్నారు…

 

నీ భాష యాస చూసి నీకు ఆకర్షితులై నీకు అభిమానులుగా మారిన జనులకు నీవు చూపించే మార్గం ఇదేనా..!?

ఒక అభిమానిగా మనం కథానాయకుడిని, కథానాయకని అభిమానించి ప్రేమించడంలో తప్పులేదు, వారు డబ్బు కోసం ఉన్నతి కోసం చేస్తున్న జీవిత సంగ్రామంలో వారిని చూసి మనం మారడం సరైన విషయం కాదు, మూడు పూటలా కడుపు నింపుకోవడానికి కష్టపడుతున్న మనం రంగులు ముఖాన వేసుకుని నటిస్తున్న మనుషులను చూసి వారిలా మారాలి అనుకోవడం, వారిలా బ్రతకాలి అనుకోవడం సరైన విషయం అస్సలు కాదు, ఒక సినిమాలో మంచిని గ్రహించలేని మనం చెడుకి బానిస అవుతున్నాం అదే దారిలో వెళుతున్నాం దీనివలన ఎన్నో రకాల సమస్యలు మనమే ఎదుర్కోవలసి వస్తుంది, అభిమానాన్ని అభిమానంగా ఉంచితే, నీ జీవితమే శ్రేయస్కరంగా ఉంటుంది, కాదని అభిమానం కాస్త వారు చూపించే చెడుకి ఆకర్షితులై బానిసలుగా మారితే నీవే కాదు నీ కుటుంబం కూడా రోడ్డున పడుతుంది, ఇదే జీవిత సత్యం… అని కవయత్రి చాలా సున్నితంగా చెప్పకనే చెప్పారు…

 

కవయత్రి ధాత్రి సమంజసంగా, ఎవరిని నొప్పించకుండా ఎంతో చాకచక్యంగా, నిడారంబరంగా జరుగుతున్న విషయాన్ని, ఇలా చేయడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అనే విషయాన్ని నేర్పుగా చెప్పడం అభినందనీయం, ఇలాంటి మరెన్నో కవనాలు, రచనలు చేయాలని యువతకు సమాజానికి ఉపయోగపడే మరెన్నో రచనలు మీ కలం నుంచి పుట్టాలని, జీవితంలో గొప్ప స్థానాన్ని మీరు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను…

 

సమీక్షకురాలు : పోలగాని భాను తేజశ్రీ MBA LLB

Related posts

అటవీశాఖలో దశల వారీగా మార్పులు: పవన్

TNR NEWS

రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలలో బండారు శ్రీనివాస్ విస్తృత ప్రచారం

Dr Suneelkumar Yandra

ఏలేరు పేస్-2 రద్దు చేయడమే వల్లే వరద ముంపు సంభవించింది – మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ

Dr Suneelkumar Yandra

పైసల్ కే సలాం  జెండా మోసిన వారికి అన్యాయం..!!

TNR NEWS

రేపు విద్యుత్ అంతరాయం* 

TNR NEWS

పిఠాపురంలో భారీ బైక్ ర్యాలీ

Dr Suneelkumar Yandra