కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని 29
కార్మిక చట్టాలను పునర్దురించాలని,
కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించడానికి, కార్మికులకు నష్టం చేసి, పెట్టుబడిదారులకు, యాజమాన్యాలకు లాభం చేసే 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపి వేయాలని, కార్మికులందరికి కనీస వేతనం నెలకు 26 వేలు నిర్ణయించి ఇవ్వాలని తదితర డిమాండ్స్ కేంద్ర, రాష్ట్ర కార్మిక, ఉద్యోగ సంఘాలు 2025 జూలై 9న దేశవ్యాప్త సమ్మె పిలుపునిచ్చాయి అందులో భాగంగా బుధవారం మండలంలోని వివిధ రంగాల
కార్మికులం ఈ క్రింది డిమాండ్స్ పై సమ్మెలో పాల్గొన్నాము. కావున ఈ క్రింది సమస్యలు ప్రభుత్వానికి నివేదించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
డిమాండ్లు: 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి, 29 పాత కార్మిక చట్టాలను పునఃపరిశీలించాలి. 2. కనీస వేతనం నెలకు 26 వేలుగా నిర్ణయించి ఇవ్వాలి. 3. రాష్ట్ర ప్రభుత్వం 8 నుండి 10 గం॥ల పనిగంటలు పెంచుతూ జారీ చేసిన 282 జి.ఓ. ను రద్దు చేయాలి. 4.గ్రామపంచాయితీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి. మల్టీపర్సస్ విధానాన్ని రద్దుచేయాలి 5.ఆశ కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి, పని భారం తగ్గించాలి.
6.అంగన్వాడి టీచర్లను, ఆయాలను కార్మికుల చట్టాల పరిధిలో తేవాలి.7. మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి. 8. సింగరేణి, ఎన్టీపీసీ, ఎల్ఐసి, రైల్వే, బ్యాంకులు తదితర ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి.