భూభారతి దరఖాస్తులను త్వరగా పరిశీలించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ అన్నారు. గురువారం కోదాడ తహసిల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.. దరఖాస్తులను పరిష్కరించుటకు తగు సూచనలు చేశారు. రెవిన్యూ సదస్సులు వచ్చిన ప్రతి దరఖాస్తును భూభారతిలో తప్పక నమోదు చేయాలన్నారు. సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి భూభారతి దరఖాస్తులను పరిశీలించారు.
